రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస‌ తీర్మానం.. విపక్షాల నోటీసు

రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు మంగళవారం నోటీసులు ఇచ్చాయి.

By Medi Samrat  Published on  10 Dec 2024 4:00 PM IST
రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస‌ తీర్మానం.. విపక్షాల నోటీసు

రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు మంగళవారం నోటీసులు ఇచ్చాయి. ఈ నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి అందజేశారు. దాదాపు 60 మంది ఎంపీలు నోటీసుపై సంతకాలు చేశారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలపై చైర్మన్‌ ధన్‌ఖర్‌ పక్షపాతం చూపిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

కాంగ్రెస్‌కు ఆర్జేడీ, టీఎంసీ, సీపీఐ, సీపీఐ (ఎం), జేఎంఎం, ఆప్, డీఎంకే మద్దతు ఉంది. ఈ నోటీసుపై దాదాపు 60 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకాలు ఉన్నాయి. రాజ్యసభ ఛైర్మన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ప్రతిపక్షాలకు మరో మార్గం లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బి) ప్రకారం రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, రాజ్యసభలో మెజారిటీ సభ్యులందరూ ఆమోదించిన తీర్మానంతో, లోక్‌సభ సమ్మతితో ఛైర్మన్‌ను తొలగించవచ్చు. కానీ 14 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వాలి. ఆగస్టు నెలలో కూడా కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే యోచన‌లో ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (బి) కింద ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. దీనికి కనీసం 50 మంది ఎంపీల సంతకాలు అవసరం.. ప్రతిపక్షాలకు 60 మంది ఎంపీల మద్దతు లభించింది. వర్షాకాల సమావేశాల్లోనే రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్‌ కూడా సిద్ధమైంది. అయితే తర్వాత వాయిదా పడింది. సభ లెక్కల ప్రకారం.. అధికార పార్టీకి మెజారిటీ ఉంది. ఈ కోణం నుండి చూస్తే రాజ్యసభ ఛైర్మన్ త‌ప్పించ‌డం అసాధ్యం అనిపిస్తుంది.

Next Story