ఆపరేషన్ దేవి శ‌క్తి మొదలుపెట్టిన భారత్

Operation Devi Shakti India evacuates more than 800 people from Afghanistan.ఆఫ్ఘనిస్తాన్ లో ఉద్రిక్త పరిస్ధితులు ఉండడంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 9:45 AM GMT
ఆపరేషన్ దేవి శ‌క్తి  మొదలుపెట్టిన భారత్

ఆఫ్ఘనిస్తాన్ లో ఉద్రిక్త పరిస్ధితులు ఉండడంతో అన్ని దేశాలు వారి పౌరులను ఆఫ్ఘన్ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతికూల పరిస్ధితుల్లోనూ భారత్ కూడా పౌరులను తరలిస్తోంది. ఇప్పటికే పలు విడతలుగా పౌరులు, దౌత్య సిబ్బంది, అధికారులు భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. మిగిలిపోయిన భారతీయుల కోసం కేంద్రం ప్రత్యేక ఆప‌రేష‌న్ చేపట్టింది. దీనికి '' ఆపరేషన్ దేవి శ‌క్తి ''గా పేరు పెట్టింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ట్వీట్ చేశారు. ఈ రోజు భార‌తీయులు స‌హా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి త‌జ‌కిస్థాన్‌లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. ఈ ఆప‌రేష‌న్ చేప‌డుతోన్న భార‌త వైమానిక సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

భారతీయులను అక్కడి నుండి తీసుకుని రావడానికి భార‌త వైమానిక సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆప‌రేష‌న్ దేవి శ‌క్తి కొన‌సాగుతోంద‌ని చెప్పారు. దుషన్బే నుంచి భార‌త్ కు 25 మంది భార‌తీయులు స‌హా 78 మంది విమానంలో బ‌య‌లుదేరిన వీడియోను ఓ అధికారి పోస్ట్ చేశారు. ఆఫ్ఘన్ లోని వివిధ నగరాల్లో ఉన్న భారతీయులను కాబూల్ కు తీసుకుని వచ్చి.. అక్కడి నుండి భారత్ కు చెందిన విమానాల్లోకి ఎక్కించి భారత్ కు చేరవేస్తూ ఉన్నారు. భారత్ ప్రతి రోజూ కాబూల్ కు రెండు విమానాలను నడుపుతూ ఉంది. ఇప్పటి దాకా 800 మందికి పైగా భారత్ కు తీసుకుని వచ్చారు.

Next Story
Share it