ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర.. కిలో @ రూ.80

ఉల్లి ధర మరోసారి భారీగా పెరిగింది. రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర ప్రజలను కంటతడి పెట్టించింది

By Kalasani Durgapraveen  Published on  11 Nov 2024 2:29 PM IST
ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధర.. కిలో @ రూ.80

ఉల్లి ధర మరోసారి భారీగా పెరిగింది. రాజధాని ఢిల్లీతోపాటు దేశంలోని పలు నగరాల్లో ఉల్లి ధర ప్రజలను కంటతడి పెట్టించింది. అదే సమయంలో ఢిల్లీలో కిలో ఉల్లిని రూ.80కి విక్రయిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదల అనేక నగరాల్లోని మార్కెట్‌లలో ప్రజల కళ్లలో కన్నీళ్లు మిగిల్చింది, దీని కారణంగా వినియోగదారులు కలత చెందుతున్నారు. హోల్ సేల్ మార్కెట్లలో కిలో ఉల్లి ధర రూ.40-60 నుంచి రూ.70-80కి పెరిగింది. ఢిల్లీలోని ఓ మార్కెట్‌లో ఒక విక్రేత ANIతో మాట్లాడుతూ.. “ఉల్లి ధర కిలోకు 60 నుండి 70 రూపాయలకు పెరిగింది. మేము మార్కెట్ నుండి కొనుగోలు చేస్తాము.. మాకు లభించే ధరలు మేం విక్రయించే ధరపై ప్రభావం చూపుతాయి. "ధరల పెరుగుదల కారణంగా అమ్మకాలు తగ్గాయి.. కానీ ఇక్కడ ఆహారపు అలవాట్లలో ఇది ముఖ్యమైన భాగం కాబట్టి ప్రజలు ఇప్పటికీ కొనుగోలు చేస్తున్నారని అన్నాడు.

ఫైజా అనే కొనుగోలుదారు ఉల్లి ధరల పెరుగుదలపై తన ఆందోళనను వ్య‌క్తం చేశారు. “ఉల్లి ధర పెరిగింది, అయితే అది సీజన్ ప్రకారం తగ్గాలి. కిలో ఉల్లి రూ.70కి కొన్నాను. దీంతో ఇంట్లో ఆహారపు అలవాట్లపై ప్రభావం పడింది. కనీసం రోజూ వినియోగించే కూరగాయల ధరలను తగ్గించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని వాపోయంది.

ముంబైలోని కొనుగోలుదారు డాక్టర్ ఖాన్ ధరల పెరుగుదల గురించి ANIతో మాట్లాడుతూ, "ఉల్లిపాయ, వెల్లుల్లి ధర రెట్టింపు అయ్యింది. ఇది ఇంటి బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపుతుందొ. నేను రూ.360ల‌తో 5 కిలోల ఉల్లిపాయలు కొన్నానని చెప్పాడు.

మరో కొనుగోలుదారు ఆకాష్‌ మాట్లాడుతూ.. ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి.. ఉల్లి ధర కిలో రూ.40-60 నుంచి రూ.70-80కి పెరిగింది. సెన్సెక్స్‌ పెరుగుదల, పతనం వంటి వాటి ధర ఉల్లిపాయ కూడా హెచ్చుతగ్గులకు గురవుతుందని అన్నాడు.

ద్రవ్యోల్బణం కారణంగా ఉల్లి ధర పెరిగిందని, రూ.60 నుంచి రూ.70-75కి పెరిగిందని.. అయితే ఇది ప్రధానమైన కూరగాయ కావడంతో వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారి కిషోర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో రూ. 80 రేంజ్‌లో విక్రయిస్తున్నారు.

Next Story