Viral Video : టికెట్టు గొడవ.. టీటీఈపై విరుచుకుప‌డ్డ ప్రయాణికుడు

ముంబైలోని లోకల్ ట్రైన్‌లో చెల్లుబాటు అయ్యే టికెట్ లేని కారణంగా జరిమానా చెల్లించాలని కోరిన టికెట్ ఇన్‌స్పెక్టర్ (టీటీఈ)పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు

By Medi Samrat  Published on  17 Aug 2024 2:02 PM GMT
Viral Video : టికెట్టు గొడవ.. టీటీఈపై విరుచుకుప‌డ్డ ప్రయాణికుడు

ముంబైలోని లోకల్ ట్రైన్‌లో చెల్లుబాటు అయ్యే టికెట్ లేని కారణంగా జరిమానా చెల్లించాలని కోరిన టికెట్ ఇన్‌స్పెక్టర్ (టీటీఈ)పై ఓ ప్రయాణికుడు దాడి చేశాడు. అతనికి ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది.. కానీ ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లో పట్టుబడ్డాడు. ఆ ప్రయాణికుడు చర్చ్‌గేట్‌ నుంచి విరార్‌కు వెళ్తున్నాడు. చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ జస్బీర్ సింగ్ ప్రయాణికుడైన అనికేత్ భోసలే వద్ద ఏసీ లోకల్ టిక్కెట్ లేదని తెలుసుకున్నాడు.. అతడిని జరిమానా చెల్లించమని అడిగాడు. అనికేత్ భోసలే జరిమానాపై వాదించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ మొద‌లైంది.

సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భోసలే టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ చొక్కా కూడా చించివేశాడు. టీటీఈ గొడవలో గాయపడ్డాడు కూడా.. ఇతర ప్రయాణీకుల నుండి జరిమానాగా సేకరించిన 1,500 రూపాయలను పోగొట్టుకున్నాడు. గొడవ కారణంగా బోరివలి స్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. స్టేషన్‌లోని ఒక అధికారి మాట్లాడుతూ.. టీటీఈ అనికేత్ భోసలేను డిబోర్డ్ చేయమని అడిగాడు.. కానీ అందుకు అతను నిరాకరించాడు. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది అనికేత్ భోసలేను నాలసోపరా స్టేషన్‌లో రైలు నుంచి దింపారు. అనికేత్ తన తప్పును అంగీకరించాడు. అతనిపై FIR నమోదు చేస్తే తన ఉద్యోగంపై ప్రభావం చూపుతుందని భావించి వ్రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు.

Next Story