తమిళనాడులో ఒమిక్రాన్‌ భయం.. ఆ దేశాల నుంచి వచ్చిన వారిలో 82 మంది అనుమానితులు..

Omicron variant symptoms in 82 people in tamilnadu state. ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్న వేళ.. కొత్త వేరియంట్‌

By అంజి  Published on  23 Dec 2021 5:41 AM GMT
తమిళనాడులో ఒమిక్రాన్‌ భయం.. ఆ దేశాల నుంచి వచ్చిన వారిలో 82 మంది అనుమానితులు..

భారత్‌లో ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతున్న వేళ.. కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్‌తో కలకలం రేపుతోంది. భారత్‌లో ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య 236కు చేరుకుంది. పలు రాష్ట్రాల్లో ఓమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం అందరిలో టెన్షన్‌ పెరుగుతోంది. ఇక తమిళనాడు రాష్ట్రంలోని విదేశాల నుండి వచ్చిన వారిలో ఎక్కువగా ఓమిక్రాన్‌ వేరియంట్‌ లక్షణాలు కనిపించాయి. సుమారు 82 మంది నమూనాలను పరీక్షల నిమిత్తం బెంగళూరు ల్యాబ్‌కు పంపించారు. ఆ నమూనాల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. నైజీరియా నుండి వచ్చిన వ్యక్తి ఓమిక్రాన్‌ సోకింది. అతడు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

కాగా తాజాగా పంపిన నమూనాల్లో ఓమిక్రాన్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా 82 మంది అనుమానితులను కింగ్స్‌ ఆస్పత్రిలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. అనుమానితుల నమూనాల ఫలితాలు ఇవాళ వచ్చే ఛాన్స్‌ ఉందని వైద్యులు తెలిపారు. టాంజానియా నుండి నెల్లైకు వచ్చిన ఓ యువకుడికి ఓమిక్రాన్‌ లక్షణాలు కనిపించాయి. అలాగే కెన్యా దేశం నుండి చెన్నైకి వచ్చిన ఓ 39 ఏళ్ల మహిళకు ఓమిక్రాన్‌ నిర్దారణ అయ్యింది. ఆమె తిరుపతికి వెళ్లడంతో.. అక్కడి వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక రాష్ట్ర సరిహద్దుల్లోనూ అధికారులను అప్రమత్తం చేసింది తమిళనాడు సర్కార్‌. ఏపీ, కేరళ రాష్ట్రాల నుండి వచ్చే వారికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్టాలిన్‌ సర్కార్‌ ఇప్పటికే ఓమిక్రాన్‌ వేరియంట్‌కు సంబంధించి జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.

Next Story