ఆ నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా అబ్దుల్లాకే..!

జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వాన్ని ఇక ఏర్పాటు చేయడం లాంఛనంగా కనిపిస్తోంది.

By Medi Samrat  Published on  10 Oct 2024 1:49 PM GMT
ఆ నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా అబ్దుల్లాకే..!

జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వాన్ని ఇక ఏర్పాటు చేయడం లాంఛనంగా కనిపిస్తోంది.నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతునివ్వడంతో మెజారిటీని అందుకుంది. ఇందర్వాల్, ఛంబ్, సురన్‌కోట్, బానీ స్థానాలలో గెలుపొందిన ప్యారే లాల్ శర్మ, సతీష్ శర్మ, చౌదరి మహ్మద్ అక్రమ్, డాక్టర్ రామేశ్వర్ సింగ్ నేషనల్ కాన్ఫరెన్స్ కి మద్దతు ఇచ్చారు. దీంతో పార్టీకి ఇప్పుడు 46 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. ఈ పరిణామాల కారణంగా నేషనల్ కాన్ఫరెన్స్ కు కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు.

మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎన్‌సీ 42, కాంగ్రెస్‌ ఆరు స్థానాల్లో గెలిచాయి. జమ్మూ ప్రాంతంలో ఆధిపత్యం వహించిన భారతీయ జనతా పార్టీ 29 స్థానాల్లో గెలిచింది. ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో కాషాయ పార్టీ మెజారిటీ సంఖ్య 32కి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో కుప్పకూలింది.

Next Story