పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ.. వాహనదారుల నడ్డీ విరుస్తున్నాయి. గడిచిన 3 వారాల్లో పెట్రోల్ ధరలు 15 సార్లు, డీజిల్ ధరలు 18 సార్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మొన్న ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్లీ పెరగడం మొదలయ్యాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38పైసలను పెంచారు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర ర.109.3, డీజిల్ ధర రూ.102.80గా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.79, లీటర్ డీజిల్ ధర రూ.93.5
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.75, లీటర్ డీజిల్ ధర రూ.101.40
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.10, లీటర్ డీజిల్ ధర రూ.97.93
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.44, లీటర్ డీజిల్ ధర రూ.96.63