మైనర్ బాలికపై అత్యాచారం.. 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు
Odisha court sentences man to 10 years in jail for raping minor girl. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని 2015లో టీనేజర్‌పై అత్యాచారం చేసిన కేసులో
By Medi Samrat Published on
28 Jan 2022 12:25 PM GMT

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని 2015లో టీనేజర్‌పై అత్యాచారం చేసిన కేసులో 26 ఏళ్ల వ్యక్తికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. బరిపాడ పోక్సో కోర్టు న్యాయమూర్తి సుమితా జెనా నిందితుడు దుఖిరామ్ ముర్ముకి రూ. 10,000 జరిమానా విధించారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభినా పట్నాయక్ తెలిపారు. అలాగే బాధితురాలైన మైనర్ బాలికకు రూ.3 లక్షలు పరిహారంగా చెల్లించాలని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు గురువారం ఆదేశించింది.
2015 సంవత్సరం జూన్ 5న బాధితురాలైన 15 ఏళ్ల బాలిక ట్యూషన్ క్లాస్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నిందితుడు దుఖిరామ్ ముర్ము ఆమెను బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక వాంగ్మూలం, వైద్య నివేదికలు, 16 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తీర్పు వెలువడిందని ప్రాసిక్యూషన్ తెలిపింది.
Next Story