అలర్ట్.. ఇలా చేయకపోతే మీ UPI చెల్లింపులు అన్నీ ఫెయిల్ అవుతాయి.. రేపటి నుంచే కొత్త నిబంధన..
కొన్ని సంవత్సరాలుగా UPI భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది.
By Medi Samrat Published on 31 Jan 2025 8:59 AM IST
కొన్ని సంవత్సరాలుగా UPI భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది. డిసెంబర్ 2024లో లావాదేవీ పరిమాణం 16.73 బిలియన్లకు చేరుకుంది. ఇది నవంబర్ నుంచి 8% పెరిగింది. భారత్ నగదు రహిత UPI లావాదేవీల వైపు వేగంగా కదులుతోంది., ముఖ్యంగా టైర్-1 నగరాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. అయితే.. UPI వ్యవస్థ సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యం. సైబర్ నేరగాళ్లు తరచుగా అమాయక ప్రజలను మోసం చేసేదుకు UPIని పావుగా వాడుతున్నారు. అందువల్ల NPCI ఒక కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిని UPI వినియోగదారులందరూ అమలు చేయాల్సివుంటుంది.
ఫిబ్రవరి 1, 2025 నుండి UPI IDలో ప్రత్యేక అక్షరాలు(Special characters) అనుమతించబడవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. మనలో చాలా మందికి UPI IDలలో ప్రత్యేక అక్షరాలు(Special characters) ఉన్నాయి.. కాబట్టి వాటిని వెంటనే సరిదిద్దుకోవాల్సి వుంటుంది. పెరుగుతున్న UPI వ్యవస్థలో భద్రతను మెరుగుపరచడానికి.. డిజిటల్ లావాదేవీలను ప్రామాణీకరించడానికి NPCI ఈ ప్రకటన చేసింది.
అన్ని UPI లావాదేవీ IDలు ఖచ్చితంగా ఆల్ఫాన్యూమరిక్‌గా మాత్రమే ఉండాలని జనవరి 9 నాటి సర్క్యులర్ పేర్కొంది. దీని అర్థం @, !, # వంటి Special characters అనుమతించబడవు. ప్రత్యేక అక్షరాలు కలిగి ఉన్న IDలు చేసే లావాదేవీలు ఆటోమెటిక్‌గా విఫలమవుతాయి. కొన్ని బ్యాంకులు, చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే ఈ అవసరానికి అనుగుణంగా ఉండగా.. కానీ, కొన్ని సంస్థలు నాన్-కాంప్లైంట్ ఫార్మాట్‌లను ఉపయోగిస్తూనే ఉన్నాయని NPCI తెలిపింది.
ఇప్పుడు ఏదైనా లావాదేవీల వైఫల్యాలను నివారించడానికి.. మీరు మీ UPI ID సరిగ్గా ఫార్మాట్ చేయబడిందా లేదా అని నిర్ధారించుకోవాలి. ఉదాహరణకు.. 1234567890oksbi వంటి ID చెల్లుతుంది.. గడువు ముగిసిన తర్వాత 1234567890@ok-sbi పని చేయదు.
మీరు మీ UPI యాప్‌కి వెళ్లి.. మీ UPI ID ఎలా వుందో తనిఖీ చేయండి. అవసరమైతే మీరు సరిదిద్దుకోవాలి.
ఎందుకంటే గడువు ఫిబ్రవరి 1 వరకు మాత్రమే. మీరు మీ UPI IDని సకాలంలో అప్‌డేట్ చేయకపోతే.. మీరు చెల్లింపు చేయలేరు.. చెల్లింపును పూర్తి చేయడానికి మీరు IDని సరిచేయాలి. చివరి నిమిషంలో అవాంతరాలను ఎదురవకుండా గడువుకు ముందే ఆ పని పూర్తి చేయండి. మీకు ఖచ్చితంగా తెలియకపోతే.. సహాయం కోసం మీరు నేరుగా కస్టమర్ సపోర్ట్ టీమ్‌కి కాల్ చేయవచ్చు.