పబ్లిసిటీ స్టంట్ కాదు, సీరియస్‌గా తీసుకోండి..బాలీవుడ్ సెలబ్రిటీస్‌కు ఈ-మెయిల్ బెదిరింపులు

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు వరుస బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలీవుడ్‌కు చెందిన కమెడియన్, యాక్టర్ కపిల్ శర్మ, నటుడు రాజ్‌పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా, సింగర్ సుగంధ మిశ్రాలకు బెదిరింపు ఈ-మెయిల్‌లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

By Knakam Karthik  Published on  23 Jan 2025 11:03 AM IST
national news, bollywood, email threat, Kapil Sharma, Rajpal Yadav, Remo D’Souza, Sugandha Mishra

పబ్లిసిటీ స్టంట్ కాదు, సీరియస్‌గా తీసుకోండి..బాలీవుడ్ సెలబ్రిటీస్‌కు ఈ-మెయిల్ బెదిరింపులు

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు వరుస బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలీవుడ్‌కు చెందిన కమెడియన్, యాక్టర్ కపిల్ శర్మ, నటుడు రాజ్‌పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా, సింగర్ సుగంధ మిశ్రాలకు బెదిరింపు ఈ-మెయిల్‌లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడు స్టార్ సల్మాన్ ఖాన్ వరుస బెదిరింపులను ఇటీవలే ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు ఆయన ఇంట్లోనే కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్ రీసెంట్‌గానే కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంతలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

బిష్ణు అనే పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. బెదిరింపు మెయిల్‌లో.. మేము మీ ప్రతి కదలికను ఎప్పటికప్పుడు నిశితంగాత పరిశీలిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం అయితే కానే కాదు. మీరు ఈ సందేశాన్ని సీరియస్‌గా తీసుకోండి అటూ ఈ-మెయిల్‌లో పేర్కొన్నట్లు పలు నేషనల్ మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.

బెదిరింపు మెయిల్స్‌పై బాలీవుడ్ సెలబ్రిటీస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైంది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఈ-మెయిల్ ఐపీ అడ్రస్ పాకిస్థాన్‌కు చెందినదిగా తమ ప్రాథమిక విచారణలో గుర్తించారు.

Next Story