డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి కిట్‌లు లేక‌పోవ‌డంతో భారీగా పెండింగ్ కేసులు

Non-availability of DNA test kits. హర్యానాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి కిట్‌లు లేనందున

By Medi Samrat
Published on : 23 May 2023 5:19 PM IST

డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి కిట్‌లు లేక‌పోవ‌డంతో భారీగా పెండింగ్ కేసులు

హర్యానాలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి కిట్‌లు లేనందున హర్యానాలో మహిళలు, చిన్నారులపై అత్యాచారం, హత్యల వంటి దారుణమైన నేరాలకు సంబంధించిన 1,500 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. 2021 నుండి జరిగిన పలు నేరాలకు సంబంధించిన కేసుల విచారణ నిలిచిపోయింది. కర్నాల్‌లోని మధుబన్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)లో DNA PCR కిట్‌లు లేకపోవడం వల్ల విచారణలో జాప్యం జరిగింది.

ఫోరెన్సిక్ నివేదికల కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్న పాల్వాల్ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు (ఎఫ్‌టిసి) న్యాయమూర్తి ఈ సమస్యను బయట పెట్టారు. పాల్వాల్ లో ప్రస్తుతం 53 రేప్/పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, కిట్ లు లేకపోవడంతో విచారణలు నిలిచిపోయాయి. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ చెప్పినట్లుగా 2 సంవత్సరాలుగా DNA PCR కిట్‌లు అందుబాటులో లేకపోవడంతో విచారణ జరగడం లేదు. అవసరమైన కిట్‌లను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. DNA PCR కిట్‌ల కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్న సంబంధిత అధికారుల వివరణ కోరుతూ ఉన్నారు. హర్యానా అంతటా దాదాపు 1500 దారుణమైన నేరాల కేసులకు జడ్జిమెంట్ రావడం లేదు. అందుకు కారణం కిట్ లు అందుబాటులో లేకపోవడమే..!


Next Story