ఎనిమిదో తరగతి వరకూ విద్యార్థులకు సెలవులు ఇచ్చేసారు. నోయిడాలో చలి తీవ్రత పెరగడంతో జిల్లా మేజిస్ట్రేట్ అన్ని బోర్డులకు సంబంధించి 8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. జనవరి 2 నుండి తదుపరి నోటీసు వచ్చే వరకు పాఠశాలలు మూసివేయనున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బోర్డులు, CBSE, ICSE బోర్డు కింద నడిచే అన్ని పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
ఏదైనా పాఠశాల ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు. జిల్లా మేజిస్ట్రేట్ నుండి తదుపరి నోటీసు వచ్చేవరకు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం గురువారం నాడు 8- 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు నోయిడాను జనవరి 3 నుండి 6 వరకు చుట్టుముడుతుందని వాతావరణ శాఖ సూచించింది.