టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా

రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఆయ‌న వారసత్వాన్ని స్వాధీనం చేసుకోనున్నారు.

By Medi Samrat
Published on : 11 Oct 2024 2:29 PM IST

టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటా

రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఆయ‌న వారసత్వాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటాను నియమించినట్లు నివేదిక‌లు తెలుపుతున్నాయి. మరణానికి ముందు రతన్ టాటా టాటా ట్రస్ట్‌కు అధిపతిగా ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో.. నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డు స‌భ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూప్‌లోని అతిపెద్ద కంపెనీ టాటా సన్స్.. అయితే నిర్వహణ పరంగా టాటా ట్రస్ట్ మరింత ఉన్నతంగా ఉంది.

టాటా ట్రస్ట్ వాస్తవానికి టాటా గ్రూప్ స్వచ్ఛంద సంస్థల సమూహం. 13 లక్షల కోట్ల ఆదాయంతో టాటా గ్రూప్‌లో అత్యధికంగా 66 శాతం వాటాను కలిగి ఉంది. టాటా ట్రస్ట్ పరిధిలోకి వచ్చే సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ టాటా సన్స్‌లో 52 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

Next Story