ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ, ముడి చమురు సరఫరాకు ఎలాంటి సమస్యా లేదు: కేంద్రం

దేశంలో తగినంత ముడి చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని, దేశంలో ఇంధన కొరత విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్రం తెలిపింది.

By -  Medi Samrat
Published on : 6 March 2026 9:00 AM IST

ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ, ముడి చమురు సరఫరాకు ఎలాంటి సమస్యా లేదు: కేంద్రం

దేశంలో తగినంత ముడి చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని, దేశంలో ఇంధన కొరత విషయంలో ఆందోళన అవసరం లేదని కేంద్రం తెలిపింది. పెట్రోల్, డీజిల్ గురించి ఎలాంటి నిబంధనలు విధించడంలేదని, దేశంలో కావాల్సిన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని స్పష్టం చేసింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి, ప్రజలు, పరిశ్రమలకు ఇబ్బంది ఉండదని తెలిపింది. దేశ ఇంధన భద్రత గురించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ, ముడి చమురు సరఫరాకు ఎలాంటి సమస్యా లేదు. ప్రాధాన్యతా రంగాలకు గ్యాస్ సరఫరా నిరంతరం అందించడానికి గెయిల్ అవసరమైతే ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారత్‌కు పంపించాల్సిన ఎల్ఎన్‌జీ విషయంలో ఖతార్ ఇదే విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుతం మనకు ఖతార్ రోజుకు 60 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను సరఫరా చేస్తోంది.

Next Story