2000 నోట్ల మార్పిడికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటీసు జారీ చేసింది. రూ.2000 లేదా రూ.20,000 వరకు ఉన్న 10 నోట్లను మార్చుకునేందుకు ఎలాంటి ఫారమ్ లేదా స్లిప్ నింపాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంటే మీరు ఎస్‌బీఐ ఏదైనా బ్రాంచ్‌ని సందర్శించి ఎటువంటి ఫారమ్‌ను పూరించకుండా సులభంగా రూ.2,000 నోట్లను మార్చుకోవచ్చు. బ్యాంక్ జారీ చేసిన నోటీసులో రూ. 2,000 నోట్లను రూ. 20,000 లోపు మార్చుకునేటప్పుడు మీకు ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదని స్పష్టంగా పేర్కొంది.
మే 19, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన చేసింది. నోటును ఉపసంహరించుకున్న తర్వాత కూడా.. మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు సాధారణ ప్రజలు రూ.2000 నోట్లను సొంతంగా మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఒకసారి ఒక వ్యక్తి గరిష్టంగా రూ.20,000 విలువచేసే 10 నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది.