ఉక్రెయిన్ వైద్య విద్యార్ధుల భవిష్యత్తుపై కేంద్రం సంచలన సమాధానం

NMC doesn’t have data on placing medical students from Ukraine. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తూ

By Medi Samrat  Published on  23 July 2022 5:29 PM IST
ఉక్రెయిన్ వైద్య విద్యార్ధుల భవిష్యత్తుపై కేంద్రం సంచలన సమాధానం

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తూ అర్ధాంతరంగా స్వదేశానికి వచ్చేసిన భారతీయ విద్యా విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ వైద్య విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్‌కు వచ్చిన వైద్య విద్యార్ధులకు లోకల్ కాలేజీలలో అడ్మిషన్లపై ఎన్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం విదేశాల నుంచి భారత్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ కారణంగా.. ఉక్రెయిన్ లో ఇప్పటికిప్పుడే సాధారణ పరిస్థితులు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో తమ చదువు, భవిష్యత్తుపై వైద్య విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. భారత్ లోనే తాము చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని వైద్య విద్యార్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. తమ చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును ఆ పిటిషన్ లో వైద్య విద్యార్ధులు కోరారు. ఇక కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఉక్రెయిన్ విద్యార్థులకు చదువు కోసం అయ్యే ఖర్చును భరిస్తామని చెప్పారు. ఇప్పుడు కేంద్రం మాత్రం ఊహించని షాకిచ్చింది.








Next Story