స్పెషల్ స్టేటస్ డిమాండ్ మొదలెట్టేసిన సీఎం

జనతాదళ్ (యునైటెడ్) శనివారం ఢిల్లీలో తన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది.

By Medi Samrat  Published on  29 Jun 2024 3:10 PM IST
స్పెషల్ స్టేటస్ డిమాండ్ మొదలెట్టేసిన సీఎం

జనతాదళ్ (యునైటెడ్) శనివారం ఢిల్లీలో తన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది. పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కోసం ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీహార్‌కు ప్రత్యేక హోదా కోసం నితీష్ కుమార్ వాయిస్ వినిపించడం ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. లోక్‌సభలో 12 స్థానాలు జేడీయూకు ఉండడంతో ప్రస్తుతం BJP ప్రభుత్వం ముందుకు వెనక్కు వెళ్లడంపై ఆధారపడింది.

నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు, జెడి(యు) నేతలతో సహా అన్ని పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు, డిమాండ్లు వచ్చాయి. ఇక జెడి(యు) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి చిరకాల డిమాండ్‌గా ఉన్న బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను కోరాలని జేడీయూ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశంలో సమర్పించిన రాజకీయ ప్రతిపాదనలో ఈ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.

Next Story