రైలులో అండర్ వేర్ తో తిరిగిన ఎమ్మెల్యే

Nitish Kumar's MLA Explains Why He Was Seen In His Underwear On Train. జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండ‌ల్ ట్రైన్ లో లో దుస్తులు

By M.S.R  Published on  3 Sept 2021 3:49 PM IST
రైలులో అండర్ వేర్ తో తిరిగిన ఎమ్మెల్యే

జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండ‌ల్ ట్రైన్ లో లో దుస్తులు మాత్రమే వేసుకుని కంపార్ట్మెంట్ లో తిరిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. బీహార్ ఎమ్మెల్యే గోపాల్ మండల్ తన లోదుస్తులలో పాట్నా నుండి న్యూఢిల్లీకి ప్రయాణంలో తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్ యొక్క AC ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో కనిపించిన ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ప్రవర్తనపై ఇతర ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో గొడవకు దారితీసింది. రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF) అధికారులు, టీసీ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

సెకండ్ ఏసీ కోచ్‌లో ఆయ‌న బ‌నియ‌న్‌, అండ‌ర్‌వేర్‌లో అటూ ఇటూ తిరిగారు. దీనిపై ఆ కోచ్‌లో ఉన్న ప్ర‌యాణికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. యూపీలోని దిల్‌దార్ న‌గ‌ర్ జంక్ష‌న్ వ‌ద్ద .. లోదుస్తుల్లో ఉన్న ఎమ్మెల్యేకు.. ఆ కోచ్‌లో ఉన్న ఇత‌ర ప్యాసింజెర్ల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ఆయ‌న ఇత‌ర ప్యాసింజెర్ల ముందే బ‌ట్టలు విప్పేశారు. ఎమ్మెల్యే గోపాల్ వ్య‌వ‌హార శైలిని పలువురు ఖండించారు.

త‌న క‌డుపులో తేడా కొట్టడం వ‌ల్లే తాను తొంద‌ర‌లో అండ‌ర్‌గార్మెంట్స్‌తో ప‌రుగుపెట్టిన‌ట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. రైలు ఎక్కిన వెంట‌నే.. మ‌రుగుదొడ్డికి వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందని, త‌క్ష‌ణ‌మే కుర్తా పైజామా విప్పేసి.. భుజంపై ట‌వ‌ల్ వేసుకుని శౌచాల‌యానికి వెళ్లాల‌న‌న్నారు. ట‌వ‌ల్‌ను త‌న న‌డుముకు చుట్టుకునే టైమ్ లేద‌ని ఎమ్మెల్యే అన్నారు. కంపార్ట్‌మెంట్ లోపల ఏ స్త్రీ లేదా అమ్మాయి లేనప్పటికీ వివాదం సృష్టించారని ఎమ్మెల్యే అన్నారు.



Next Story