ఆయనపై వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది..!

Nitish Kumar Affected By Age, Has Turned Delusional. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat
Published on : 9 Oct 2022 8:45 PM IST

ఆయనపై వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది..!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవాలను అర్థం కాకుండా వేరే విషయాలు మాట్లాడుతున్నారని.. నితీష్ కుమార్ వయస్సు ఆయన్ను ప్రభావితం చేస్తోందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. నితీశ్ కుమార్ పై వయసు ప్రభావం పడుతోందని, ఆయన భ్రాంతికి లోనవుతున్నారని విమర్శించారు. రాజకీయంగా ఏకాకిగా మారిన నితీశ్ కుమార్, ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడుతున్నారని.. నితీశ్ ఎంతో అసహనంతో కనిపిస్తున్నారని, బహుశా అది వయసు ప్రభావం అనుకుంటా అని ప్రశాంత్ కిశోర్ అన్నారు.

ప్రశాంత్ కిశోర్ బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు.. దీనిపై నితీశ్ కుమార్ విమర్శిస్తూ, బీజేపీ కోసమే ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ తాజాగా స్పందించారు. "నేను బీజేపీ అజెండాతో పనిచేస్తున్నానని ఆయన అంటున్నారు. అదే సమయంలో, ఆయన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని చెప్పానట. ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టయితే, ఆయన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయాలని ఎలా చెబుతాను? ఒకవేళ ఆయన చేసిన రెండో ఆరోపణ కరెక్ట్ అయితే, మొదటి ఆరోపణ తప్పు అవుతుంది" అని వెల్లడించారు. ఆయనపై వయసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

కిషోర్ తన పాదయాత్రను అక్టోబర్ 2న భీతిహర్వా గాంధీ ఆశ్రమం నుండి ప్రారంభించారు. 1990 నుంచి రాష్ట్రం మారలేదని, బీహార్‌ను పాలించిన అన్ని రాజకీయ పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడి ప్రజలు ఉపాధి వెతుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లక తప్పదన్నారు. కిషోర్ కొంతకాలం JD (U) జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు, కానీ తరువాత పార్టీ నుండి బయటకు వచ్చేసారు.


Next Story