16న నితీష్ కేబినెట్ విస్తరణ

Nitish Cabinet Will Be Expanded On June 16. బీహార్ సీఎం నితీష్ కేబినెట్ నుంచి జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ మాంఝీ వైదొలిగాడు

By Medi Samrat
Published on : 14 Jun 2023 2:56 PM IST

16న నితీష్ కేబినెట్ విస్తరణ

బీహార్ సీఎం నితీష్ కేబినెట్ నుంచి జితన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ మాంఝీ వైదొలిగాడు. ఆయ‌న త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయడంతో ఆ బెర్తును పూయించ‌డానికి మంత్రివర్గ విస్తరణ ప్ర‌క‌ట‌న‌ అధికారికంగా వెలువడింది. జూన్ 16 శుక్రవారం నితీశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. సంతోష్ మాంఝీ స్థానంలో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఎమ్మెల్యే రత్నేష్ సదాకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వ‌చ్చాయి. వాటికి తెర‌దించుతూ.. జూన్ 16న ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. జనతాదళ్ యునైటెడ్ నుంచి రత్నేష్ సదా మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు బీహార్‌ గవర్నర్‌ సెక్రటేరియట్‌ నుంచి లేఖ కూడా విడుదలైంది.





Next Story