భారతదేశంలో మరోసారి నిఫా వైరస్ కలకలం చెలరేగింది. పశ్చిమ బెంగాల్‌లో ఐదు నిపా కేసులు నిర్ధారించారు. దాదాపు 100 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. పలు విమానాశ్రయాల్లో నిబంధనలను కట్టుదిట్టం చేశారు. కోవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలను ముమ్మరం చేశాయి. పశ్చిమ బెంగాల్‌లో ఒక ఆసుపత్రిలో వైరస్ గుర్తించారు. అదే జిల్లాకు చెందిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో రెండు కేసులు నమోదయ్యాయి. నర్సు, మరొ ఆసుపత్రి ఉద్యోగికి కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మొత్తం 5 కేసులను నిర్ధారించారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక వ్యక్తి తెలియని వ్యాధితో మరణించడం, మరో ఐదుగురు ఈ వైరస్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చింది.
అనేక ఆసియా దేశాల విమానాశ్రయాలు ఆరోగ్య పరీక్షలను కఠినతరం చేశాయి. థాయిలాండ్, నేపాల్, తైవాన్‌తో సహా అనేక ఆసియా దేశాలు పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్‌లలో స్క్రీనింగ్‌లను ముమ్మరం చేశాయి. చైనీస్ న్యూఇయర్ సీజన్‌కు ముందు నిపా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన పుట్టిస్తోంది. నిపా వైరస్ చాలా అరుదుగా ఉన్నప్పటికీ, తెలిసిన అత్యంత ప్రాణాంతక వైరల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి. మరణాల రేటు అనేక ఇతర శ్వాసకోశ వ్యాధుల కంటే చాలా ఎక్కువగా ఉంది.