నేడు తొమ్మిది వందే భారత్ రైళ్ల ప్రారంభం

11 రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 9 వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు.

By అంజి  Published on  24 Sept 2023 7:00 AM IST
Vande Bharat trains, Narendra Modi , Telangana, National news

నేడు తొమ్మిది వందే భారత్ రైళ్ల ప్రారంభం

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌. మరో 9 వందేభారత్‌ రైళ్లు.. పట్టాలేక్కేందుకు సిద్ధమయ్యాయి. 11 రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 9 వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. తొమ్మిది రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ 11 రాష్ట్రాలలో వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తాయి. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఫ్లాగ్ ఆఫ్ కానున్న కొత్త రైళ్లు: ఉదయపూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తిరునల్వేలి-మధురై - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ - చెన్నై (రేణిగుంట మీదుగా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ , కాసరగోడ్ - తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రూర్కెలా - భువనేశ్వర్ - పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.

ఈ తొమ్మిది రైళ్లు రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ వంటి 11 రాష్ట్రాలలో కనెక్టివిటీని పెంచుతాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వందే భారత్ రైళ్లు తమ ఆపరేషన్ మార్గాల్లో అత్యంత వేగవంతమైన రైళ్లుగా ఉంటాయి. ప్రయాణీకుల సమయాన్ని గణనీయంగా ఆదా చేయడంలో సహాయపడతాయి.

రూర్కెలా- భువనేశ్వర్ - పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాసరగోడ్ - తిరువనంతపురం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ప్రస్తుతం ఉన్న అత్యంత వేగవంతమైన రైలుతో పోలిస్తే, సుమారు మూడు గంటలపాటు వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి. హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2.5 గంటలకు పైగా; తిరునెల్వేలి-మధురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలకు పైగా; రాంచీ - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ , జామ్‌నగర్-అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సుమారు గంట సమయం, ఉదయపూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి అరగంట సమయం ఆదా అవుతుంది.

Next Story