ఆ టెర్రరిస్ట్‌ సంస్థకు రహస్య పత్రాలు లీక్.. ఐపీఎస్ అధికారి అరెస్టు

NIA arrests IPS officer for 'leaking' secret documents to terror group. నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన గ్రౌండ్ వర్కర్‌కు రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై జాతీయ

By అంజి  Published on  19 Feb 2022 3:22 AM GMT
ఆ టెర్రరిస్ట్‌ సంస్థకు రహస్య పత్రాలు లీక్.. ఐపీఎస్ అధికారి అరెస్టు

నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన గ్రౌండ్ వర్కర్‌కు రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మాజీ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి), ఐపిఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగీని శుక్రవారం అరెస్టు చేసినట్లు దాని అధికారిక ప్రతినిధి తెలిపారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌గా పదోన్నతి పొందిన పోలీసు అధికారి నేగీని గతేడాది నవంబర్ 6న ఎన్‌ఐఏ నమోదు చేసిన కేసుకు సంబంధించి అరెస్టు చేసినట్లు అధికార ప్రతినిధి తెలిపారు.

భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళిక, అమలులో మద్దతునిచ్చినందుకు నిషేధించబడిన లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్‌వర్క్ వ్యాప్తికి సంబంధించిన కేసు. ఈ కేసులో గతంలో ఎన్‌ఐఏ ఆరుగురిని అరెస్టు చేసింది. "విచారణ సమయంలో సిమ్లాలో పోస్ట్ చేయబడిన ఐపీఎస్‌ అధికారి అరవింద్‌ దిగ్విజయ్‌ నేగి పాత్ర ధృవీకరించబడింది. అతని ఇళ్లలో సోదాలు జరిగాయి. ఎన్‌ఐఏ యొక్క అధికారిక రహస్య పత్రాలను నేగి మరొక నిందితుడికి లీక్ చేసినట్లు కూడా కనుగొనబడింది.'' అని అధికార ప్రతినిధి తెలిపారు.

Next Story