గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. బిష్ణోయ్‌ను బుధవారం ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.

By -  Medi Samrat
Published on : 19 Nov 2025 3:16 PM IST

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. బిష్ణోయ్‌ను బుధవారం ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో దిగిన వెంటనే అన్మోల్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. దీని తర్వాత అతనిపై నమోదైన కేసుల్లో ఢిల్లీ, ముంబై, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ పోలీసులు ఒక్కొక్కటిగా చర్యలు తీసుకోనున్నారు.

ఢిల్లీ క్రైం బ్రాంచ్‌లో కూడా అన్మోల్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. 2023లో ఇద్దరు వ్యాపారుల నుంచి కోట్లాది రూపాయల బలవంతపు డబ్బు డిమాండ్ చేసి వారు డబ్బులు చెల్లించకపోవడంతో వారి ఇళ్లపై కాల్పులు జరిపాడు.

లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన చాలా మంది వ్య‌క్తుల‌ను అరెస్టు చేయ‌డంతో వారి నెట్‌వర్క్ బలహీనంగా మారిందని వర్గాలు చెబుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ ప్రత్యర్ధులు, గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా ప్రభావం పెరుగుతోంది. వీరి షూటర్లలో ఎక్కువ మంది దుబాయ్, కెనడా, అమెరికాలో చురుకుగా ఉన్నారు.

కొంతకాలం క్రితం దుబాయ్‌లో మొదటిసారి ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య గ్యాంగ్ వార్ జ‌రిగింది. అక్కడ లారెన్స్ షూటర్‌ను గోదారా గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది. హత్య తర్వాత గోదార చ‌నిపోయిన వ్య‌క్తి మెడలోని చిత్రాన్ని పంచుకోవడం ద్వారా హ‌త్య‌కు బాధ్యత వహించాడు. ఆపై లారెన్స్ గ్యాంగ్‌ను బహిరంగంగా బెదిరించాడు.

విదేశీ గడ్డపై ఈ గ్యాంగ్ వార్ తర్వాత, గోదారా గ్రూప్ పెరుగుతున్న ప్రభావం అన్మోల్ బిష్ణోయ్ ఆందోళనను పెంచింది. ప్రత్యర్థి ముఠాల బెదిరింపుల కారణంగా అతనికి ప్రాణభయం ఏర్పడిందని.. ఈ కారణంగా అన్మోల్ అమెరికాలోని ఏజెన్సీల ముందు లొంగిపోవడమే మంచిదని భావించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీని కారణంగా అతడిని భారతదేశానికి తీసుకురావడంలో భారత భద్రతా సంస్థలు విజయం సాధించాయి.

Next Story