Delhi Blast : సూసైడ్ బాంబ‌ర్‌తో కలిసి పేలుళ్ల‌కు కుట్ర పన్నిన వ్య‌క్తిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పురోగ‌తి సాధించింది.

By -  Medi Samrat
Published on : 16 Nov 2025 8:32 PM IST

Delhi Blast : సూసైడ్ బాంబ‌ర్‌తో కలిసి పేలుళ్ల‌కు కుట్ర పన్నిన వ్య‌క్తిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పురోగ‌తి సాధించింది. ఈ ఉగ్రవాద దాడికి ఆత్మాహుతి బాంబర్‌తో కలిసి కుట్ర పన్నిన కాశ్మీరీ నివాసిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. ఈ పేలుళ్ల‌లో 10 మంది మరణించగా, 32 మంది గాయపడ్డారు. దాడికి పాల్పడిన కారు అమీర్ రషీద్ అలీ పేరు మీద రిజిస్టర్ చేయబడింది. ఢిల్లీ పోలీసుల నుంచి కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్ఐఏ భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.

నవంబర్ 10వ తేదీ సోమవారం సాయంత్రం 7 గంటలకు ఎర్రకోట సమీపంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఢిల్లీ మొత్తం నివ్వెరపోయింది. ఈ దాడిలో 10 మంది మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. దుకాణాల‌ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ చూసి అందరి గుండెలు వణికిపోయాయి. పేలుడు తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయబడిన సంఘటన స్థలానికి వెళ్లే రహదారి ఇప్పుడు సాధారణ ప్రజల రాక‌పోక‌ల కోసం తెరిచారు. శనివారం ఉదయం నుంచి ఇక్కడి నుంచి వాహనాలకు అనుమ‌తించ‌డంతో పాత ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగించింది.

Next Story