త్వరలోనే సరికొత్త ధృవ్ ఎంకె-III హెలికాఫ్టర్లను అందుకోనున్న భారత నేవీ

New Variant Of ‘Dhruv’ MK-III Helicopter For Indian Navy. మేడిన్ ఇండియా మార్క్-III వేరియంట్ అయిన 'ధృవ్' అడ్వాన్స్డ్ లైట్

By Medi Samrat  Published on  5 Dec 2020 3:58 AM GMT
త్వరలోనే సరికొత్త ధృవ్ ఎంకె-III హెలికాఫ్టర్లను అందుకోనున్న భారత నేవీ

మేడిన్ ఇండియా మార్క్-III వేరియంట్ అయిన 'ధృవ్' అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్(ఏ.ఎల్.హెచ్) ను భారత నేవీ(ఐ.ఎన్), భారత కోస్టల్ గార్డ్(ఐసిజి) కోసం తయారు చేస్తూ ఉన్నారు. మొదటి బ్యాచ్ ను అతి త్వరలోనే భారత నేవీ, భారత కోస్టల్ గార్డ్ లకు ఇవ్వనున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్.ఏ.ఎల్) ఇచ్చిన సమయంలోనే విమానాల తయారీని పూర్తీ చేస్తోంది. ఇప్పటికే భారత ఆర్మీ, భారత ఎయిర్ ఫోర్స్ లో అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్స్ కొత్త వెర్షన్ (ఎంకె-III యూటిలిటీ, ఆయుధాలను మోసుకుని వెళ్లే ఎంకె-IV రుద్ర) పెద్ద ఎత్తున ఉన్నాయి. భారత నేవీ, భారత కోస్టల్ గార్డ్ లు ఇంతవరకూ ఎంకె-I వేరియంట్ ను ఉపయోగిస్తూ వచ్చాయి.

సరికొత్త మార్క్-III వేరియంట్ అయిన 'ధృవ్' అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లలో గ్లాస్ కాక్ పిట్ మాత్రమే కాకుండా, హెచ్.ఏ.ఎల్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్ డిస్ప్లే సిస్టమ్(ఐఏడిఎస్) తో పాటూ శక్తి (Safran Ardiden 1H1) ఇంజన్స్ కూడా ఉండనున్నాయి. హెచ్.ఏ.ఎల్ విమానానికి చెందిన అన్ని పనులను పూర్తీ చేసింది. రెండు సంవత్సరాల వ్యవధిలో విమానాలను అప్పగించాలని హెచ్.ఏ.ఎల్ తో భారత నేవీ, భారత కోస్టల్ గార్డ్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అనుకున్నట్లుగానే హెచ్.ఏ.ఎల్ తమ పని పూర్తీ చేసింది. కానీ కోవిద్-19 లాక్ డౌన్ కారణంగా ఫీల్డ్ ట్రయల్స్ కు అంతరాయం ఏర్పడింది.

మే 2020న లాక్ డౌన్ కు సంబంధించిన నిబంధనలను కొద్ది వరకూ సడలించడంతో సెన్సార్ ఇంటిగ్రేషన్, సీ ట్రయల్స్ కొచ్చి, చెన్నై, గోవాలలోమొదలయ్యాయి. బెంగళూరు లోనూ ఈ విమానాలను కస్టమర్ ట్రైనింగ్ కు ఉంచారు. కోస్టల్ సెక్యూరిటీ కోసం 32 ఏ.ఎల్.హెచ్. ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ హెలీకాఫ్టర్లలో 14 విమానాలను మార్చి 2021 లోపు అందించాలని హెచ్.ఏ.ఎల్ భావిస్తోంది. సెప్టెంబర్ 2021 లోపు మొత్తం 32 హెలికాఫ్టర్లను అందించాలనే లక్ష్యంతో హెచ్.ఏ.ఎల్ పని చేస్తోంది.


Next Story