బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు

New twist in AAP candidate kidnap drama. బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సూరత్‌ ఈస్ట్‌ నుంచి తమ పార్టీ తరపున పోటీ చేస్తున్

By M.S.R  Published on  16 Nov 2022 3:30 PM GMT
బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు

బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సూరత్‌ ఈస్ట్‌ నుంచి తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న కాంచన్‌ జరీవాలాను బీజేపీ కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేసిందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. మంగళవారం కిడ్నాపైన కాంచన్‌ను 500 మంది పోలీసులు బలవంతంగా ఎన్నికల సంఘం కార్యాలయానికి తీసుకొచ్చి నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. దీంతో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ధర్నా చేపట్టారు. భారత చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదని , ఎన్నికల సంఘం వెంటనే బీజేపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అంతకు ముందు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సూరత్ (తూర్పు) నియోజవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచల్ జరీవాల్ కనిపించకుండా పోయారని ట్వీట్ చేశారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కంచల్ జరీవాల్ పై ఒత్తిడి చేశారని, ఇప్పుడు కనిపించకుండా పోయారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. సూరత్ (తూర్పు) నియోజవర్గ మా అభ్యర్థి కంచన్ జరివాలా, ఆయన కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. మొదట, ఆయన నామినేషన్ తిరస్కరించడానికి బీజేపీ ప్రయత్నించింది. కానీ నామినేషన్ ను ఆమోదం లభించింది. తరువాత, తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని కంచన్ పై ఒత్తిడి వచ్చిందని కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు.


Next Story