వాహనదారులకు కొత్త నిబంధనలు.. 15 రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే..

New regulations for motorists. కేంద్ర ప్రభుత్వపు రోడ్డు రవాణా శాఖ వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ సర్వీసులు పొందాలనుకుంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే.

By Medi Samrat  Published on  10 Feb 2021 8:28 AM GMT
New regulations for motorists

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ కార్డుతో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ హోల్డర్స్‌, వాహన యజమానులు వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీలో పేరు, చిరునామా మార్పు లాంటి దాదాపు 15 రకాల సేవలను ఇక నుంచి సులభంగా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఈ సేవలు ఉపయోగించుకోవడానికి ఆధార్‌ తప్పనిసరి చేసింది. ఆధార్‌ కార్డు వెరిఫికేషన్ రూల్స్‌ చాలా వాటికి వర్తించేలా చర్యలు చేపట్టనుంది. ఈ సేవతో వాహనదారులు గంటల తరబడి ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి క్యూలో నిల్చోని ఇబ్బందులు పడే అవస్థలు తప్పనున్నాయి.


అయితే కేంద్ర ప్రభుత్వపు రోడ్డు రవాణా శాఖ వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ సర్వీసులు పొందాలనుకుంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆన్‌లైన్ డ్రైవింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ రెన్యూవల్‌, అడ్రస్‌ మార్పు, వెహికల్‌ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇలా పలు రకాల సేవలకు రానున్న రోజుల్లో ఆధార్‌ నెంబర్ ను తప్పనిసరి చేయబోతోంది.

ఆధార్‌ వెరిఫై చేసుకోకపోతే మీరు ఏ సేవలు పొందాలనుకున్నా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్‌ వెరిఫికేషన్‌ అమలు చేయడం వల్ల నకిలీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు ఈజీగా దొరికిపోతారు. ఇక అదే సమయంలో వాహనదారులకు బెనిఫిట్‌ ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. ఆధార్‌ కార్డు లేకపోతే ఆధార్‌ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆధార్ ఎన్ రోల్‌మెంట్ నంబర్‌ ఇచ్చిన సరిపోతుంది.
Next Story
Share it