నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

By Medi Samrat  Published on  13 Feb 2025 3:58 PM IST
నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు లోక్‌సభ నుండి వాకౌట్ చేశాయి. ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కాసేపటికి లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది. 1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, ఇప్పటి వరకు ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో ఇది సంక్లిష్టంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని మోదీ ప్రభుత్వం గతంలో తెలిపింది. ఈ మేరకు ఇప్పుడు బిల్లును రూపొందించారు.

కొత్త ఆదాయపు పన్ను బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని సిఫార్సు చేశారు. సెలెక్ట్ కమిటీ సభ్యుల పేర్ల జాబితాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్వరలో విడుదల చేయనున్నారు. ఈ కమిటీ తన నివేదికను వచ్చే సెషన్‌లో (వర్షాకాల సెషన్‌) సమర్పించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Next Story