పొద్దున్నే బాధ్యతలు.. ఇంతలో పోస్టర్లు చించివేత

New Congress chief Mallikarjun Kharge's poster torn in Karnataka's Kolar. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా నేడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  26 Oct 2022 3:41 PM IST
పొద్దున్నే బాధ్యతలు.. ఇంతలో పోస్టర్లు చించివేత

మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా నేడు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే..! ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే పార్టీ 98వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. తనమీద విశ్వాసం ఉంచి పార్టీ అధ్యక్షుడిగా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలతో పాటు సోనియా గాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. ఒక కార్మికుడి కొడుకు, పార్టీ సాధారణ కార్యకర్త ఈరోజు ఇలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం కలలో కూడా ఊహించలేమని అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే కర్ణాటకలోని కోలార్‌లో మల్లికార్జున్ ఖర్గే పోస్టర్‌ను చింపేశారు. వక్కలేరి గ్రామ రహదారిని పార్టీ కార్యకర్తలు దిగ్బంధించారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్‌గా ఖర్గే బాధ్యతలు స్వీకరించిన రోజే గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్‌ను చింపేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోలారు రూరల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Next Story