ముంబైకి చెందిన ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ లేకుండా స్కూటీపై ప్రయాణించారు. దీనిని ఒకరు ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులకు రూల్స్ ఉండవా అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘MH01ED0659 What if we travel like this?? Isn’t this a traffic rule violation? @MumbaiPolice @mieknathshinde @Dev_Fadnavis,” అంటూ రాహుల్ బర్మన్ అనే నెటిజన్ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ముంబై పోలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఆయన ట్యాగ్ చేశారు.
బర్మాన్ ట్వీట్‌కు ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ఫోటో తీసిన రోడ్డు లొకేషన్‌ను షేర్ చేయమని అడిగారు. బర్మాన్ “ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే (దాదర్)” అని రాశారు. "అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ విభాగానికి చెందిన సీనియర్ అధికారితో పంచుకున్నాము" అని పోలీసులు బదులిచ్చారు. అయితే నెటిజన్లు మాత్రం ఈ-చలాన్ ఫోటో అప్లోడ్ చేయమని డిమాండ్ చేశారు.