నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనకోడలు రోమా రే కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. వృద్ధాప్య వ్యాధుల కారణంగా దక్షిణ కోల్కతాలోని తన నివాసంలో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు శరత్ చంద్రబోస్ కుమార్తె రోమా రే. శరత్ చంద్రబోస్ దేశం ఒకటిగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆమె తన మేనమామ సుభాష్ చంద్రబోస్ ను అతి దగ్గర నుంచి చూశారు. ఆమె నేతాజీ భార్య ఎమిలీతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. 1950లలో వియన్నాలో ఎమిలీతో కలిసి రోమా రే నివసించారు. ఆమె ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సచిస్ రేను రోమా వివాహం చేసుకున్నారు.