ఈ ఎన్నికల్లో ఎంత మందికి ఓటు వేసే ఛాన్స్ ఉందంటే.?

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.

By Medi Samrat  Published on  9 Feb 2024 12:26 PM GMT
ఈ ఎన్నికల్లో ఎంత మందికి ఓటు వేసే ఛాన్స్ ఉందంటే.?

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది అర్హత పొందనున్నారని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 2 కోట్ల మంది యువ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును మొదటిసారి ఉపయోగించుకోనున్నారని తెలిపింది. గత లోక్‌సభ ఎన్నికలు-2019తో పోల్చితే నమోదైన ఓటర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగిందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యధికంగా 96.88 కోట్ల మంది భారత ఓటర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారని ఈసీ పేర్కొంది. కాగా లింగ నిష్పత్తి విషయంలో పెరుగుదల నమోదయిందని, 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి చేరిందని వెల్లడించింది.

ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం గురువారం ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 3,30,37,113 మంది ఓటర్లు ఉన్నారు. 3.3 కోట్లకు పైగా అర్హత కలిగిన ఓటర్లలో 1,64,47,132 మంది పురుషులు, 1,65,87,244 మంది మహిళలు.. 2,737 మంది ఇతరులు ఓటర్లు ఉన్నారు. 15,378 సర్వీస్ ఎలక్టర్లు.. 3,399 ఓవర్సీస్ ఓటర్లు కూడా ఉన్నారు. ఓటరు నమోదు ఏడాది పొడవునా కొనసాగుతుందని సీఈఓ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారితోపాటు ఏప్రిల్‌, జులై, అక్టోబరు ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Next Story