కమ్యూనిటీ ఈవెంట్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. 100 మందికిపైగా అస్వస్థత

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫుడ్‌పాయిజన్‌ ​​ఘటనలో ఆదివారం దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు.

By అంజి  Published on  3 Jun 2024 4:56 AM GMT
food poisoning, Udaipur, Rajasthan

కమ్యూనిటీ ఈవెంట్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. 100 మందికిపైగా అస్వస్థత

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫుడ్‌పాయిజన్‌ ​​ఘటనలో ఆదివారం దాదాపు 100 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. బ్లాక్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సాకేత్‌ జైన్‌.. రోగుల ప్రాథమిక పరీక్షల అనంతరం ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగినట్లు కనిపించిందని చెప్పారు. రిపోర్ట్స్‌ ప్రకారం.. ఓ కమ్యూనిటీ ఈవెంట్‌లో ఖిచ్డీ తిన్న తర్వాత చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు పెరిగాయి. ఆ తర్వాత వారు సమీపంలోని ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఆదివారం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా 'సామ' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, దీనికి సుమారు 1,500 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. సంఘం కార్యక్రమంలో ఖిచ్డీ వంటకాన్ని నైవేద్యంగా తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. కానీ ఈవెంట్‌కు హాజరైన వారికి అది తిన్న తర్వాత వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన వారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం సమయానికి రోగుల తాకిడి వేగంగా పెరగడంతో జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

Next Story