ట్రెండ్స్ లో బీజేపీ ముందంజ
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాలు కనిపిస్తున్నాయి.
By Medi Samrat Published on 23 Nov 2024 4:06 AM GMTమహారాష్ట్రలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 288 నియోజకవర్గాలు ఉండగా ఉదయం 8.30 గంటల సమయానికి 90 నియోజకవర్గాలకు సంబంధించి తొలి రౌండ్ ఫలితాలు వచ్చాయి. 68 చోట్ల ఎన్డీయే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మహా వికాస్ అఘాడి అభ్యర్థులు కేవలం 14 నియోజకవర్గాల్లో మాత్రమే ఆధిక్యంలో కనిపించారు.
బారామతిలో ఎన్‌సిపి నాయకుడు అజిత్ పవార్, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, సకోలీలో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే ముందంజలో ఉన్నారు.
ముంబైలో కాల్చి చంపబడిన NCP నాయకుడు బాబా సిద్ధిఖ్ కుమారుడు జీషన్ సిద్ధిఖీ ప్రారంభ ట్రెండ్‌ల ప్రకారం, బాంద్రా ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుండి ముందంజలో ఉన్నారు. హై ప్రొఫైల్ ఎన్నికల పోరులో శివసేన (యుబిటి) అభ్యర్థి వరుణ్ సర్దేశాయ్‌పై ఎన్‌సిపికి చెందిన జీషన్ సిద్ధిక్ పోటీ పడుతున్నారు.
జార్ఖండ్‌లో కూడా ఎన్డీయే దూకుడు కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలు ఉండగా ఉదయం 8.30 గంటలకు 41 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వెలువడగా బీజేసీ సారధ్యంలోని కూటమి అభ్యర్థులు 29 చోట్ల, జేఎంఎం నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు 12 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో నిలిచారు.