పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగిన NDA పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు. ఇటీవలి ఆపరేషన్ సింధూర్‌తో విజయం సాధించినందుకు.. ప్రధాని మోదీని సన్మానించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ .. ప్రధాని మెడలో పూలమాల వేశారు. హర హర మహాదేవ్ అంటూ ఎన్డీఏ ఎంపీలు నినాదాలు చేశారు. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ తర్వాత తొలిసారి ఎన్డీఏ కూటమి ఎంపీలు భేటీ అయ్యారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు, ప్రతిపక్షాలు వ్యవహారశైలిపై కూడా ఆ భేటీలో చర్చించారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత.. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను ఆ ఆపరేషన్ ద్వారా పేల్చేశారు. వందల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. ఆ తర్వాత పెహల్గామ్ ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారుల్ని ఆపరేషన్ మహాదేవ్‌లో భాగంగా హతమార్చిన విషయం తెలిసిందే.