బీహార్ ఎన్నికలు.. సమాన స్థానాలలో బ‌రిలో దిగుతున్న‌ జేడీయూ, బీజేపీ..!

సుదీర్ఘ తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు ఎన్డీయేలో సీట్ల విభజన జరిగింది.

By -  Medi Samrat
Published on : 12 Oct 2025 9:10 PM IST

బీహార్ ఎన్నికలు.. సమాన స్థానాలలో బ‌రిలో దిగుతున్న‌ జేడీయూ, బీజేపీ..!

సుదీర్ఘ తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు ఎన్డీయేలో సీట్ల విభజన జరిగింది. ఈసారి సీట్ల పంపకం కింద జేడీయూ, బీజేపీలకు సమాన స్థానాలు దక్కాయి. ఈ విషయాన్ని బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్, జేడీయూ నేత సంజయ్ ఝా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీట్ల పంపకం కింద ఈసారి జేడీయూ, బీజేపీ 101-101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 29 స్థానాల్లో పోటీ చేసే అవకాశం లభించింది. దీంతో పాటు జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహా పార్టీలకు 6 సీట్లు కేటాయించారు. సీట్ల పంపకంలో జేడీయూ గరిష్టంగా 14 సీట్లను వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీ తొమ్మిది సీట్లు కోల్పోయింది.

సీట్ల పంపకం గురించి సమాచారం ఇస్తూ, జెడియు నాయకుడు సంజయ్ ఝా ఇలా రాశారు. మేము ఎన్‌డిఎ సహచరులం.. సుహృద్భావ వాతావరణంలో సీట్ల పంపిణీని పూర్తి చేసాము. JDU - 101, BJP - 101, LJP(R)- 29, RLM - 06, HAM - 06. NDAలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు దీనిని సంతోషంతో స్వాగతించారు. అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి నిశ్చయించుకున్నారు. ఐక్యంగా ఉన్నారు. బీహార్ సిద్ధమైంది, మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్ప‌డ‌బోతుంది అని రాశారు.

సీట్ల పంపకం గురించి సమాచారం ఇస్తూ, బిజెపి నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ ఇలా వ్రాశారు, మేము NDA మిత్రులం సుహృద్భావ వాతావరణంలో సీట్ల పంపిణీని పూర్తి చేసాము. BJP – 101, JDU – 101, LJP (R) – 29, RLM – 06, HAM – 06. అన్ని ఎన్‌డిఎ పార్టీల కార్యకర్తలు మరియు నాయకులు దీనిని సంతోషంగా స్వాగతించారు. బీహార్ సిద్ధమైంది, మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్ప‌డుతుందని రాశారు.

Next Story