వాహనదారులకు భారీ షాక్..పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత్‌లో ఇంధన సెగ మొదలైంది.
By - Knakam Karthik |
వాహనదారులకు భారీ షాక్..పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో భారత్‌లో ఇంధన సెగ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సుమారు 50 శాతం మేర పెరగడంతో, దేశీయ ప్రైవేట్ రంగ ఇంధన దిగ్గజం నయారా ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుండి పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 చొప్పున పెంచింది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు ఆటంకాలు కలగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. మన దేశంలోని 1.02 లక్షల పెట్రోల్ బంకుల్లో 6,967 బంకులను నిర్వహిస్తున్న నయారా, పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భరించలేక ఈ భారాన్ని వినియోగదారులపై మోపింది. స్థానిక వ్యాట్ (VAT) పన్నులను బట్టి కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 5.30 వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ దిగ్గజం జియో-బీపీ ప్రస్తుతానికి ధరలను పెంచకపోయినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో మిగిలిన సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.