ఉద్ధవ్ ఠాక్రే గూండాయిజం అంతం కావాలి : అమిత్ షాకు ఎంపీ విజ్ఞప్తి
Navneet Rana's message for Amit Shah. శివసేన, అధికార మహా వికాస్ అఘాదీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న
By Medi Samrat Published on 25 Jun 2022 1:00 PM GMTశివసేన, అధికార మహా వికాస్ అఘాదీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ఏకనాథ్ షిండేతో పాటు ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలని అమరావతి ఎంపీ నవనీత్ రాణా శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. ఉద్ధవ్ ఠాక్రే గూండాయిజాన్ని అంతం చేయాలని కూడా ఆమె హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఉద్ధవ్ ఠాక్రేను విడిచిపెట్టి.. బాలాసాహెబ్ సిద్ధాంతాలతో ముడిపడి సొంత నిర్ణయాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత కల్పించాలని అమిత్ షాను అభ్యర్థిస్తున్నాను. ఉద్ధవ్ ఠాక్రే గూండాయిజం అంతం కావాలి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం నేను అభ్యర్థిస్తున్నానని ఆమె అన్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరైన తానాజీ సావంత్‌కు చెందిన పూణే కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేసిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ దాడిని శివసేనకు చెందిన పూణే అధినేత సంజయ్ మోరే ధృవీకరించారు. మా పార్టీ కార్యకర్తలు తానాజీ సావంత్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మా చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను ఇబ్బంది పెట్టిన దేశద్రోహులు, తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ ఈ విధమైన చర్యను ఎదుర్కొంటారు. వారి కార్యాలయంపై కూడా దాడి చేస్తారు. ఎవరినీ విడిచిపెట్టరని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ముంబై పోలీసులు అలర్ట్‌లో అయ్యారు. నగరంలోని అన్ని రాజకీయ కార్యాలయాల వద్ద భద్రత ఉండేలా అన్ని పోలీసు స్టేషన్‌లను కూడా ఆదేశించారు.
అంతకుముందు ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర ప్రభుత్వం తనతో పాటు ఇతర ఎమ్మెల్యేల భద్రతను రద్దు చేసిందని ఆరోపిస్తూ లేఖ రాశారు. అయితే ఈ వాదనను మహారాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.