Viral Video : గర్భిణిని తీసుకెళ్తున్న‌ అంబులెన్స్‌లో చెలరేగిన‌ మంటలు.. కాసేప‌టికే భారీ పేలుడు..!

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  14 Nov 2024 9:44 AM IST
Viral Video : గర్భిణిని తీసుకెళ్తున్న‌ అంబులెన్స్‌లో చెలరేగిన‌ మంటలు.. కాసేప‌టికే భారీ పేలుడు..!

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఆ తర్వాత అంబులెన్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకోవడం విశేషం. అంబులెన్స్ గర్భిణిని, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జలగావ్ ఆసుపత్రికి తీసుకువెళుతోంది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. సమాచారం ప్రకారం.. దాదావాడి ప్రాంతం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

వాహనం ఇంజిన్‌ నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన అంబులెన్స్‌ డ్రైవర్‌ వాహనం దిగి కిందకు దిగాడు. అంబులెన్స్‌లోని గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులను కూడా కిందకు గిగండ‌ని కోరాడు. వారిని వాహనం నుండి దూరంగా వెళ్లాలని కోరాడు. ఈలోపు వాహనం మొత్తం మంటలు వ్యాపించాయి. కొద్దిసేప‌టికి మంటలు ఆక్సిజన్ ట్యాంక్‌కు వ్యాపించి.. భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి. ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకున్నారు. తృటిలో ప్రమాదం త‌ప్ప‌డంతో ఉంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story