యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్‌.. తొలి గ్లోబల్ లీడర్‌గా నిలిచిన‌ ప్రధాని మోదీ..!

ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద మరో ఘనత చేరింది. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణపై ఎలాంటి సందేహం లేదు.

By Medi Samrat  Published on  26 Dec 2023 12:40 PM GMT
యూట్యూబ్‌లో అరుదైన రికార్డ్‌.. తొలి గ్లోబల్ లీడర్‌గా నిలిచిన‌ ప్రధాని మోదీ..!

ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద మరో ఘనత చేరింది. ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణపై ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలే ఇందుకు నిదర్శనం. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన‌ యూట్యూబ్‌లో కూడా ప్రధాని మోదీ ప్రజాదరణకు సంబంధించి ఓ రికార్డు న‌మోదైంది. యూట్యూబ్‌లో 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లను క‌లిగివున్న‌ తొలి గ్లోబల్ లీడర్‌గా నరేంద్ర మోదీ నిలిచారు.

యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్‌లు, వీక్షణల పరంగా.. ప్ర‌ధాని మోదీ ప్రపంచంలో తన ప్రత్యర్థి నాయకులందరినీ చాలా వెనుకకు నెట్టారు. ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానెల్‌ను మొత్తం 450 కోట్ల మంది వీక్షించారు. గతేడాది ఫిబ్రవరిలో మోదీ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి దాటింది. మోదీ ఛానెల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మూడు వీడియోలకు ఏకంగా 175 మిలియన్ల వీక్షణలు ఉన్నాయి.

ప్రధాని మోదీ తర్వాత బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన ఛానెల్‌కు 64 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. 11 లక్షల మంది సబ్‌స్క్రైబర్లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మూడో స్థానంలో ఉన్నారు. నాల్గ‌వ‌ స్థానంలో US అధ్యక్షుడు జో బిడెన్ ఉన్నారు. ఆయ‌న‌ యూట్యూబ్ ఛానెల్‌లో 7,94,000 మంది సబ్‌స్క్రైబర్‌లను క‌లిగివున్నారు. కేవలం 2023 డిసెంబర్‌లోనే రికార్డు స్థాయిలో ప్ర‌ధాని మోదీ ఛానెల్‌కు వచ్చిన మొత్తం వీక్షణలు 22.4 కోట్లు కావ‌డం విశేషం.

Next Story