రేపు నగరమంతటా 'నాకాబందీ'.. కఠినంగా అమలు.. ప్రజల కదలికలపై నిఘా

'nakabandi' in Bengaluru on New Year's eve. పోలీసులు నూతన సంవత్సరం సందర్భంగా నగరమంతటా 'నాకాబందీ'ని కఠినంగా అమలు చేయనున్నారు.

By అంజి  Published on  30 Dec 2021 1:04 PM IST
రేపు నగరమంతటా నాకాబందీ.. కఠినంగా అమలు.. ప్రజల కదలికలపై నిఘా

బెంగళూరు పోలీసులు నూతన సంవత్సరం సందర్భంగా నగరమంతటా 'నాకాబందీ'ని కఠినంగా అమలు చేయనున్నారు. వివరాల ప్రకారం.. బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ బుధవారం మాట్లాడుతూ.. బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ సహాయంతో పోలీసులు శుక్రవారం రాత్రి ప్రజల కదలికలపై నిఘా ఉంచుతారు. విమానాశ్రయ ఫ్లైఓవర్ మినహా బెంగళూరులోని ఫ్లైఓవర్‌లను పరిస్థితిని బట్టి మూసివేయనున్నట్లు పంత్ వెల్లడించారు. బెంగళూరు నగరంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల మధ్య కొత్త సంవత్సర వేడుకల కోసం కఠినమైన ప్రోటోకాల్‌లు ఇప్పటికే విధించబడ్డాయి.

రాత్రిపూట కర్ఫ్యూ సమయంలో పౌరులు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలు రద్దీని నివారించి సాధారణ కార్యకలాపాలను కొనసాగించాలని బీబీఎమ్‌పీ చీఫ్ కమిషనర్ గౌరవ్ గుప్తా అన్నారు. డిసెంబర్ 31 తర్వాత కోవిడ్ కేసులు పెరగకుండా చూసేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించేందుకు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించే వాణిజ్య సంస్థలపై ఎన్‌డిఎంఎ, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. అలాంటి వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడుతుంది.

Next Story