బెంగళూరులోని నేలమంగళ రోడ్డులో దాదాపు 1.5 కిలోగ్రాముల మేకులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఓ నెటిజన్ హెచ్చరించారు. "పంక్చర్ మాఫియా" ముప్పుపై ఆందోళనలకు దారితీసిన వీడియోతో పాటు ఈ హెచ్చరికను జారీ చేశారు.
ఆ పోస్ట్ ప్రకారం.. కొందరు ఉద్దేశపూర్వకంగా రద్దీగా ఉండే రోడ్లపై పదునైన మేకులను ఉంచుతూ వాహనాల టైర్లను పంక్చర్ చేస్తున్నారు. వాహనాలు పంచర్ అయిన తర్వాత, అదే బృందం లేదా వారి సహచరులు సమీపంలో కనిపించి ఖరీదైన పంచర్ సేవలను అందిస్తారు. వైరల్ క్లిప్‌లో ఒక వ్యక్తి మెటల్ డిటెక్టర్‌తో రోడ్డు పక్కన నడుస్తూ, రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న మేకులను సేకరిస్తున్నట్లు రికార్డ్ చేస్తున్నట్లు చూపించారు.
ఇది కేవలం డబ్బు కోసం చేసే మోసం మాత్రమే కాదు, పంచర్ అయినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని కూడా పోస్ట్ లో తెలిపారు. ఇలాంటి వాటికి పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, పెట్రోలింగ్ పెంచాలని, CCTV కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరారు.