రాత్రి అయితే చాలు.. ఆ ఆలయంలోకి ఎవరూ వెళ్లరు.!

Mysteries of famous chausath Yogini temple in morena madhya pradesh. భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో

By అంజి  Published on  7 Aug 2022 1:43 PM GMT
రాత్రి అయితే చాలు.. ఆ ఆలయంలోకి ఎవరూ వెళ్లరు.!

భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్‌లోని మితావాలి గ్రామంలోని 64వ యోగిని దేవాలయం. గుండ్రని ఆకారంలో, 64 గదులతో ఉండే ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ప్రతి గదిలో ఒక్కో శివలింగం, యోగిన దేవత విగ్రహం ఉంటాయి. అందుకే ఈ ఆలయానికి 64 యోగిని మందిరం అని పేరు వచ్చింది. అయితే వీటిలో కొన్ని విగ్రహాలు చోరీకి గురికాగా.. మిగిలినవాటిని ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచారు.

ఈ అద్భుతమైన ఆలయం సుమారు 1000 అడు-గుల ఎత్తుగల కొండపై వృత్తాకారంలో నిర్మించబడింది. ఈ వృత్తాకార ఆలయం ఒక ప్లేట్ లాగా కనిపిస్తుంది. ఆలయం మధ్యలో బహిరంగ మంటపం నిర్మించారు. తాబేలు రాజు దేవపాల్ 1323లో నిర్మించిన ఈ ఆలయంలో జ్యోతిష్యం, గణితం బోధించేవారు. ఈ శివాలయానికి తంత్ర-మంత్రాలను నేర్చుకునేందుకు ప్రజలు ఇక్కడికి తరలి వచ్చేవారని చెబుతుంటారు.

బ్రిటీష్ ఆర్కిటెక్చర్ ఎడ్విన్ లుటియన్స్ ఈ 64 యోగిని దేవాలయం ఆధారంగా భారత పార్లమెంటు భవనాన్ని నిర్మించాడని చెబుతారు. భారత పార్లమెంటు భవనం ఈ దేవాలయంలా ఉంటుంది. పార్లమెంట్ స్తంభాలు కూడా ఆలయ స్తంభాల మాదిరిగానే కనిపిస్తాయి. ఈ ఆలయం ఇప్పటికీ శివుని తంత్ర సాధన కవచంతో కప్పబడి ఉందని స్థానికులు నమ్ముతారు. అందుకే రాత్రి వేళ ఈ ఆలయంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. 64 యోగిని తల్లి కాళీ అవతారం అని స్థానికులు నమ్ముతారు.

Next Story