సారూ.. నా బర్రె పాలు ఇవ్వడం లేదు.. పోలీసులకు రైతు ఫిర్యాదు.. పైగా.!

My Buffalo is not giving me milk Farmers complaint. మధ్యప్రదేశ్‌ పోలీసులకు ఓ వింత కేసు వచ్చింది. బర్రె పాలు ఇవ్వడం లేదని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు

By అంజి  Published on  15 Nov 2021 8:22 AM IST
సారూ.. నా బర్రె పాలు ఇవ్వడం లేదు.. పోలీసులకు రైతు ఫిర్యాదు.. పైగా.!

మధ్యప్రదేశ్‌ పోలీసులకు ఓ వింత కేసు వచ్చింది. బర్రె పాలు ఇవ్వడం లేదని ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ కేసును పోలీసులు ఆసక్తికర రీతిలో ఛేదించారు. బాబూలాల్ జాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ జిల్లాకు చెందిన రైతు. ఎవరైనా చేతబడి చేసి ఉంటారని, అందుకే తన బర్రె పాలు ఇవ్వడం లేదని.. బర్రెతో పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో తన బర్రె ప్రతిరోజూ ఐదు లీటర్ల పాలు ఇచ్చేదని బాబూరామ్ పోలీసులకు తెలిపాడు.

గత రెండు రోజులుగా పాలు ఇవ్వడం లేదని, పాలు పితకడంలో సహాయం చేయాలని కోరాడు. కాగా పోలీసులు బర్రెను తీసుకుని వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం వెటర్నరీ డాక్టర్‌ దగ్గరి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. బర్రెకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని కూడా డాక్టర్‌ చెప్పాడు. ఆ తర్వాత రోజు నుండి తన బర్రె పాలు ఇస్తోందని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు చెప్పి ధన్యవాదాలు తెలిపాడు. పోలీసు అధికారి డిఎస్పీ అరవింద్ షా మాట్లాడుతూ.. బాబులాల్ అనే రైతు నాయాగావ్‌ గ్రామంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అందులో తన బర్రెకు గత కొన్ని రోజులుగా పాలు రావడం లేదని తెలిపాడు.

Next Story