కన్నడ భాషలో ముస్లింల ప్రార్థనలు
Muslims in Haveri village offer prayers in Kannada. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సాధారణంగా అరబిక్ భాషలో ప్రార్థనలు చేస్తారు.
By M.S.R
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సాధారణంగా అరబిక్ భాషలో ప్రార్థనలు చేస్తారు. కానీ కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాలోని చిహ్క కబ్బర్‌లోని హజ్రత్ మెహబాబ్ సుబానీ దర్గాలో కన్నడలో ప్రార్థనలు చేస్తారు. రట్టిహళ్లి తాలూకాలోని గ్రామంలో సుమారు 150 సంవత్సరాలుగా కన్నడ భాషలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. 400 ముస్లిం కుటుంబాలలో చాలా మందికి ఉర్దూ మరియు అరబిక్ తెలియదు.. కాబట్టి మౌల్వీ రోజుకు ఐదుసార్లు కన్నడలో సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సొంత జిల్లాలో ఉన్న గ్రామంలో ముస్లింలు స్థానిక భాషకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు.. ఇతర మతాలకు చెందిన ప్రజలతో కలిసి సామరస్యంగా జీవిస్తున్నారు.
ఇక గత దశాబ్దంలో, పిల్లలు పాఠశాలలో ఉర్దూ నేర్చుకోవడం ప్రారంభించారు. అయితే మసీదు వెలుపల, లోపల కన్నడ భాషలో పలు బోర్డులు ఉంటాయి. "చిహ్క కబ్బర్ గ్రామంలో చాలా మంది ముస్లింలకు అరబిక్ మరియు ఉర్దూ తెలియదు కాబట్టి ప్రార్థన సమయంలో ఈ భాషలను ఉపయోగించడం వల్ల ప్రయోజనం లేదు. ఏది ఏమైనప్పటికీ.. ఇంతకు ముందు ఉన్న మౌల్వీలు కన్నడలో ప్రసంగించే వారు.. ఎందుకంటే ముస్లింలు ప్రార్థన మరియు ఉపన్యాసాలను సులభంగా అర్థం చేసుకునే వారు.. సమాజంలోని వ్యక్తులతో కలిసిపోవడం చాలా సులభం. నేను కూడా ఆ సంప్రదాయాన్ని పాటించాను'' అని ప్రస్తుత మౌల్వీ మహమ్మద్ పీరాన్సాబ్ అన్నారు. గ్రామంలో కన్నడ ప్రార్థన ఉపన్యాసాన్ని ముస్లిమేతరులు కూడా వింటారని తెలిపారు. భాషతో సంబంధం లేకుండా.. ప్రార్థన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో ఉద్దేశ్యం ఉంటుందని అని స్థానికులు కూడా తెలిపారు.