నా ఫోన్ పోయింది.. నేను బెదిరించ‌లేదు..!

బాలీవుడ్‌లో సినీ తారలకు బెదిరింపులు వస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల‌ షారుఖ్ ఖాన్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి నుండి బెదిరింపులు వ‌చ్చాయి.

By Kalasani Durgapraveen  Published on  12 Nov 2024 12:17 PM IST
నా ఫోన్ పోయింది.. నేను బెదిరించ‌లేదు..!

బాలీవుడ్‌లో సినీ తారలకు బెదిరింపులు వస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల‌ షారుఖ్ ఖాన్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తి నుండి బెదిరింపులు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ కేసుపై ముంబై పోలీసుల నుండి ఒక ప్రకటన వచ్చింది. షారూఖ్‌ను బెదిరించిన నిందితుడు విచారణలో ఏమి చెప్పాడో కూడా సమాచారం అందించబడింది.

నవంబర్ 5న ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌కి ఒక ఫోన్ కాల్ వచ్చింది, అందులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించారు. ఇది కాకుండా 50 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారు. ఈ ఫోన్ కాల్ వచ్చిన వెంటనే.. ముంబై పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వచ్చి నిందితుల కోసం వెత‌క‌డం ప్రారంభించారు.

విచారణ తర్వాత.. ఈ కాల్ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తి నుండి వచ్చినట్లు కనుగొన్నారు. అతన్ని ఇప్పుడు ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 2న తన ఫోన్ పోయిందని.. దాని గురించి తాను సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని విచారణలో చెప్పాడు. ఇలాంటి బెదిరింపులకు ఎవరు పాల్ప‌డ్డారో తనకు తెలియదని చెబుతున్నాడు.

అయితే.. ఈ విషయంలో నిజం ఎంత? అనే విష‌య‌మై పోలీసులు విచారిస్తున్నారు. ముంబై పోలీసులు మాత్రం నిందితుడిపై సెక్షన్ 308 (4), 341 (3) (4) కింద కేసు నమోదు చేశారు. ఫైజాన్ వృత్తిరీత్యా లాయర్ అని చెబుతున్నారు. మ‌రి లాయ‌ర్ ఇలాంటి ప‌నులు చేస్తాడా.. లేదా పోయిన మొబైల్ నుంచి వేరే వ్య‌క్తి కాల్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడా అనేది తేలాల్సివుంది.

Next Story