Viral Video : ఆడి కార్‌ను ఢీ కొట్టిన‌ క్యాబ్ డ్రైవర్‌ను పైకి లేపి నేలకేసి కొట్టాడు..!

ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓలా క్యాబ్ డ్రైవర్ (24)పై దాడి చేసిన వ్యక్తి, అతని భార్యపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు

By Medi Samrat  Published on  30 Aug 2024 9:52 PM IST
Viral Video : ఆడి కార్‌ను ఢీ కొట్టిన‌ క్యాబ్ డ్రైవర్‌ను పైకి లేపి నేలకేసి కొట్టాడు..!

ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓలా క్యాబ్ డ్రైవర్ (24)పై దాడి చేసిన వ్యక్తి, అతని భార్యపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సంఘటన వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కయాముద్దీన్ మొయినుద్దీన్ ఖురేషి తన టాక్సీని ఘట్కోపర్ (W) లోని అసల్ఫా ప్రాంతంలో నడుపుతూ వచ్చాడు. ఒక లేన్‌లోకి ప్రవేశించిన తర్వాత, ఖురేషీ క్యాబ్ రిషబ్ బిభాస్ చక్రవర్తి నడుపుతున్న ఆడి క్యూ3 కారును ఢీకొట్టింది. దీంతో ఆగ్రహించిన చక్రవర్తి కారు దిగి ఖురేషీని చెంపదెబ్బ కొట్టాడు.

తరువాత.. చక్రవర్తి ఖురేషిని పైకి లేపి నేలమీద పడేశాడు. ఈ దాడిలో క్యాబ్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. జనం గుమిగూడడంతో నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన తర్వాత ఖురేషీని JJ ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం స్పృహలోకి వచ్చిన తర్వాత ఖురేషీ తన వాంగ్మూలాన్ని పోలీసులకు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్ లపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద FIR బుక్ చేశారు.

Next Story