బాలిక యూనిఫాం విప్పించి.. స్కూల్‌లోనే ఉతికిన ఉపాధ్యాయుడు.. సస్పెండ్
MP teacher suspended after disrobing girl.ఏదో అనుకుంటే ఇంకేమో అయినట్లుగా ఉంది ఈ ఉపాధ్యాయుడి పరిస్థితి.
By తోట వంశీ కుమార్ Published on 25 Sept 2022 10:35 AM ISTఏదో అనుకుంటే ఇంకేమో అయినట్లుగా ఉంది ఈ ఉపాధ్యాయుడి పరిస్థితి. పరిశుభ్రపై ప్రచారం చేసుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిక్కుల్లో పడ్డాడు. తాను చేసిన పనికి విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు
ఏం జరిగిందంటే..?
మధ్యప్రదేశ్‌లోని షాహ్దోల్ జిల్లాలోని జైసింగ్ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శ్రావణ్ కుమార్ త్రిపాఠి అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే పాఠశాలలో ఓ గిరిజన బాలిక ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల ఆ బాలిక మురికి దుస్తులతో పాఠశాలకు వచ్చింది. అయితే.. ఎప్పుడు పరిశుభ్రత గురించి మాట్లాడే శ్రావణ్‌కు అది నచ్చలేదు. బాలిక యూనిఫాంను విప్పించి స్వయంగా ఉతికి శుభ్రం చేశాడు.
అతడు చేసిన పని బాగానే ఉన్నా.. చేసిన విధానం మాత్రం బాగాలేదు. యూనిఫాం ఉతికి, అది ఆరేంత వరకు గంటల తరబడి ఆ బాలిక అలాగే అర్థనగ్నంగా నిలబడి ఉంది. యూనిఫాం ఆరిన తర్వాత తొడుక్కున్నాక కానీ బాలికను క్లాస్‌లోనికి అనుమతించలేదు. అతడు అక్కడితో ఊరుకున్న పోయేది. తాను చేసిన గురించి అందరికి తెలియాలని తాపత్రయ పడ్డాడు.
తాను యూనిఫాం ఉతుకుతుండగా ఫొటో తీయించి దానిని విద్యాశాఖ గ్రూపులో షేర్ చేసి పరిశుభ్రతకు తాను ప్రాణం ఇస్తానని రాసుకొచ్చాడు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికను గంటల తరబడి అర్థనగ్నంగా నిలబెడతారా అని ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. ఆ ఉపాధ్యాయుడిపై విద్యార్థి సంఘాలు కూడా మండిపడ్డాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. బాలికను దుస్తులు లేకుండా నిలబెట్టి యూనిఫాం ఉతికిన ఘటనపై విచారణ జరిపించి ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.