తల్లి కర్కశత్వం.. హోంవర్క్ చేయలేదని చిన్నారి కాళ్లు చేతులు క‌ట్టేసి.. మండుటెండ‌లో మిద్ద‌పై

Mother ties 5 year old daughter on rooftop in scorching heat as punishment.సాధార‌ణంగా కొంత మంది చిన్నారులు హోం వ‌ర్క్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2022 12:32 PM IST
తల్లి కర్కశత్వం.. హోంవర్క్ చేయలేదని చిన్నారి కాళ్లు చేతులు క‌ట్టేసి.. మండుటెండ‌లో మిద్ద‌పై

సాధార‌ణంగా కొంత మంది చిన్నారులు హోం వ‌ర్క్ చేయ‌కుండా మారం చేస్తుంటారు. అలాంట‌ప్పుడు వారిని బుజ్జ‌గించి హోం వ‌ర్క్ పూర్తి చేసేలా చూస్తుంటారు త‌ల్లిదండ్రులు. మ‌రీ మాట విన‌క‌పోతే చిన్న‌చిన్న శిక్ష‌లు విధిస్తుంటారు. అయితే.. ఓ మాతృమూర్తి మాత్రం దారుణంగా ప్ర‌వ‌ర్తించింది. చిన్నారి కాళ్లూ, చేతులు క‌ట్టేసి మండుటెండ‌లో మిద్దెపై ప‌డేసింది. ఎండ‌కు తాళ‌లేక ఆ చిన్నారి పెడుతున్న కేక‌లు ప‌లువురిని క‌దిలించాయి. ఈ దారుణ ఘ‌ట‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌ను వీడియో తీసిన కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల‌కు దృష్టికి వెళ్ల‌డంతో రంగంలోకి దిగారు. జూన్ 2న ఖజూరీ ఖాస్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు తెలిపారు. చిన్నారి హోం వర్క్ చేయలేదని ఆమె తల్లి కఠిన శిక్ష విధించిందని, మధ్యాహ్నం 2గంటల సమయంలో కాళ్లకు, చేతులకు తాళ్లను కట్టి మేడపై చిన్నారిని పడుకోబెట్టిందని, పొరుగింటి నుంచి 25 సెకన్ల వీడియో తీసిన మరో మహిళ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిపారు. చిన్నారి త‌ల్లిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Next Story